Nikhil: విదేశాలకి వెళుతున్న 'కార్తికేయ 2'

Karthikeya 2 movie update
షార్ట్స్‌లో చూడండి
చందూ మొండేటి - నిఖిల్ కాంబినేషన్లో 'కార్తికేయ 2' సినిమా రూపొందుతోంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. అందువలన అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తూ, మొత్తానికి పట్టాలెక్కించారు. అయితే కరోనా కారణంగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడే షూటింగు కానిస్తూ వచ్చారు.

ఈ సినిమా చివరి షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేశారు. రెండువారాల పాటు అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కానుంది. అంటే ఈ నెల చివరినాటికి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆ తరువాత గ్రాఫిక్స్ వర్క్ ను పూర్తిచేసి, వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. ఆల్రెడీ నిఖిల్ తో '18 పేజెస్' చేసిన అనుపమ పరమేశ్వరన్, 'కార్తికేయ 2'లోను జోడీ కడుతుండటం విశేషం.
Go Back to Shorts
Nikhil
Anupama Parameshwaran
Chandu Mondeti

More Telugu News