Gopichand: ఆసక్తిని రేపుతున్న 'సీటీమార్' ట్రైలర్!

  • కబడ్డీ నేపథ్యంలో నడిచే కథ 
  • కబడ్డీ కోచ్ పాత్రలో గోపీచంద్
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో తరుణ్ అరోరా 
  • సెప్టెంబర్ 10వ తేదీన విడుదల
Seetimaarr trailer released

గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' రూపొందింది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజా ట్రైలర్ ను వదిలారు. హీరో రామ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

కబడ్డీ కోచ్ గా గోపీచంద్ ఆడపిల్లలను ప్రోత్సహించడం .. అందుకు కొంతమంది అడ్డుపడటం .. ఆయన ఆశయాన్ని దెబ్బతీయడానికి కొంతమంది కుట్ర చేయడం .. అలాంటివారికి తనదైన స్టైల్లో ఆయన బుద్ధి చెప్పడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఇక తమన్నా గ్లామరస్ లుక్ తోను .. హీరో ఆశయసాధనలో ఒక భాగంగాను కనిపించింది.

యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆశయానికి అడ్డుతగిలే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లో తరుణ్ అరోరా .. రావు రమేశ్ .. రెహ్మాన్ కనిపిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను భూమిక .. పోసాని .. దిగాంగన సూర్యవన్షి పోషించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అనిపిస్తోంది.

More Telugu News