మా వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి వారికి ఎందుకు?: మంచు విష్ణు ఆగ్ర‌హం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి వారికి ఎందుకు?: మంచు విష్ణు ఆగ్ర‌హం

manchu vishnu slams netizens
  • మంచు మ‌నోజ్‌తో  గొడ‌వ‌లు ఉన్నాయంటూ ప్ర‌చారం
  • గొడ‌వ‌ల‌పై చ‌ర్చించుకునే వారిపై విష్ణు మండిపాటు
  • అస‌త్య ప్ర‌చారానికి  సమాధానం చెప్పాల్సిన అవ‌సరం లేద‌ని వ్యాఖ్య
త‌న త‌మ్ముడు, సినీ న‌టుడు మంచు మ‌నోజ్‌తో  త‌న‌కు గొడ‌వ‌లు ఉన్నాయంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారంపై మంచు విష్ణు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. వ్య‌క్తిగ‌త విషయాల గురించి ఇత‌రులు ఎందుకు చ‌ర్చించుకుంటారంటూ నిల‌దీశాడు. తాజాగా 'అలీతో స‌రదాగా' కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంచు విష్ణు ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ... త‌న అక్క మంచు లక్ష్మి త‌మతో కాకుండా వేరుగా ఉంటుందని, అలాగే మంచు మనోజ్ కూడా వేరుగానే ఉంటాడని విష్ణు వివ‌రించాడు.

తాను త‌న తండ్రి మోహ‌న్ బాబుతో ఉంటున్నాన‌ని తెలిపాడు. అంతేగానీ, త‌మ‌పై వ‌స్తోన్న అస‌త్య ప్ర‌చారానికి సమాధానం చెప్పాల్సిన అవ‌సరం లేద‌ని అన్నాడు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల బ‌రిలో మంచు విష్ణు దిగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న అక్క‌, త‌మ్ముడు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు.
Manchu Vishnu
Tollywood
Manchu Lakshmi

More Telugu News