చంద్రబాబు చదివిన స్కూల్ ను కూడా జగన్ బాగు చేయిస్తున్నారు: ఎమ్మెల్యే ఆర్కే
- అంబేద్కర్ బాటలోనే జగన్ నడుస్తున్నారు
- పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధానమని భావిస్తున్నారు
- పాఠశాలల దుస్థితికి చంద్రబాబే కారణం
స్కూల్స్ ను బాగు చేస్తున్న విషయంలో ప్రజలంతా జగన్ ను అభినందిస్తున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబు చదువుకున్న స్కూల్ కూడా దారుణంగా ఉందని తమ ఎమ్మెల్యే చెప్పారని... ఆ స్కూల్ ని కూడా జగన్ బాగు చేయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విషయాలు పత్రికలకు కనిపించవా? అని విమర్శించారు. సూళ్ల అభివృద్ధి కార్యక్రమాల తొలి దశ పనులు పూర్తయ్యాయని... రెండో దశ పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.