Sri Vishnu: 'రాజ రాజు వచ్చే' సాంగ్ కి మంచి రెస్పాన్స్!

  • వినోద ప్రధానమైన 'రాజ రాజ చోర'
  • దర్శకుడిగా హసిత్ గోలి పరిచయం
  • ఆకట్టుకుంటున్న వివేక్ సాగర్ బాణి  
  • మోహన భోగరాజు ఆలాపన  
Huge responce for Raja raju vachhe lyrical song

శ్రీవిష్ణు మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆయన తాజా చిత్రంగా సిద్ధమైన 'రాజ రాజ చోర' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ .. ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను వదిలారు. ఈ లిరికల్ సాంగ్ కి కూడా మంచి స్పందన వస్తోంది. 'రాజ రాజు వచ్చే .. 'అంటూ ఈ పాట సాగుతోంది. హీరో స్వభావం .. ఆయన చేసే దొంగపనులపై ఈ పాట నడుస్తుంది. నగలు .. కిరీటం ధరించి మరీ హీరో తప్పించుకుంటూ ఉండటం చూడటానికి సరదాగా అనిపిస్తుంది.

వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ట్యూన్ కొత్తగా .. ఆకట్టుకునేలా ఉంది. విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి, హసిత్ గోలి దర్శకత్వం వహించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, త్వరలోనే థియేటర్లలో విడుదల చేయనున్నారు.

More Telugu News