నితిన్ సినిమాలో నాయికగా 'ఉప్పెన' భామ!

Ktiti Shetty to romance with Nithin
యంగ్ హీరో నితిన్ ఇప్పుడు స్పీడు పెంచుతున్నాడు. తాను హీరోగా నటించే సినిమాలను వరుసగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే 'మాస్ట్రో' సినిమాను పూర్తిచేశాడు. హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ 'మాస్ట్రో' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటించగా.. తమన్నా ఓ కీలక పాత్ర పోషించింది.

ఇక ఈ చిత్రం తర్వాత నితిన్ రెండు సినిమాలలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో ఓ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తాడు. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రంతో దర్శకుడిగా మారిన వంశీకి ఇది రెండో సినిమా. ఇందులో కథానాయిక పాత్రకు పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.

అలాగే, దీంతో పాటుగా ప్రముఖ ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ దర్శకుడిగా రూపొందే చిత్రంలో కూడా నితిన్ నటించనున్నాడు. ఇందులో కథానాయిక పాత్రలో కృతిశెట్టి నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. 'ఉప్పెన' సినిమాతో యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కృతి ప్రస్తుతం నాని, రామ్ సినిమాలలో నటిస్తోంది.
Go Back to Shorts
Kriti Shetty
Nithin
Nani
Ram

More Telugu News