mobile: ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ట్ర‌క్కు బోల్తా.. సెల్‌ఫోన్ల‌ను ఎత్తుకుపోయిన స్థానికులు!

mobiles load truck overturned in maharastra
షార్ట్స్‌లో చూడండి
మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎల్‌ఈడీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళ్తున్న ఓ ట్ర‌క్కు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి రోడ్డుపై బోల్తా ప‌డింది. దీంతో స్థానికులంతా అక్క‌డికి ప‌రుగున వ‌చ్చి ఆ ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను ఎత్తుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ ట్ర‌క్కులోని రూ.70 ల‌క్ష‌ల విలువ‌చేసే సెల్ ఫోన్ల‌ను తీసుకుపోయారు. మ‌రికొన్ని ఎలక్ట్రానిక్ వ‌స్తువులూ మాయ‌మైన‌ట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో  షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. కొంత‌మంది కంటైనర్ తలుపును ధ్వంసం చేసి ఎలక్ట్రానిక్ వ‌స్తువుల‌ను చోరీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చోరీ చేసిన వ‌స్తువుల‌ను పోలీసుల విజ్ఞప్తితో కొంద‌రు తిరిగి అప్ప‌గించారు. చోరీ చేసిన వారంతా వాటిని తిరిగి ఇవ్వాలని పోలీసులు హెచ్చ‌రించారు.
Go Back to Shorts
mobile
truck
Maharashtra

More Telugu News