అనిల్ రావిపూడి సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనిల్ రావిపూడి సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన బాలయ్య!

Balakrishna in Anil Ravipudi direction
  • బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ'
  • తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో
  • 'క్రాక్' టీమ్ తోనే పట్టాలపైకి
  • లైన్లో అనిల్ రావిపూడి ఉన్నాడన్న బాలయ్య  
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా, దసరాకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. కథానాయికగా శ్రుతి హాసన్ .. కీలకపాత్రకిగాను వరలక్ష్మి శరత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా ఉండనుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ తన పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ ఈ సినిమాను గురించి ప్రస్తావించలేదు.

దాంతో ఈ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అభిమానులు కాస్త నిరాశకి లోనయ్యారు. అది గ్రహించిన బాలకృష్ణ ఈ విషయంలో వాళ్లకి క్లారిటీ ఇచ్చారు. అభిమానులతో జూమ్ మీట్ నిర్వహించిన బాలకృష్ణ, త్వరలో అనిల్ రావిపూడితో తన సినిమా ఉండనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లైన్లోనే ఉందనే విషయాన్ని గట్టిగానే చెప్పారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, బాలకృష్ణతో సినిమా చేయనున్నందుకు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.
Balakrishna
Boyapati Sreenu
Gopichand Malineni
Anil Ravipudi

More Telugu News