రామ్ తోనే బోయపాటి తదుపరి సినిమా?

Boyapati upcoming project
  • 'అఖండ' పనులతో బిజీగా బోయపాటి
  • ఆ వెంటనే మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
  • బిజీగా ఉన్న బన్నీ .. రవితేజ
  • అందుబాటులో ఉన్న రామ్    
'వినయ విధేయ రామ' సినిమా పరాజయంపాలు కావడంతో, బోయపాటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాదాపుగా దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బోయపాటి తన తదుపరి సినిమాను ఏ హీరోతో చేయనున్నాడనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇందుకు సంబంధించి హీరో రామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి బోయపాటి తన నెక్స్ట్ మూవీని అల్లు అర్జున్ తో గానీ .. రవితేజతో గాని చేయాలనుకున్నాడు. గతంలో ఈ ఇద్దరితో చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఇద్దరిలో ఒకరిని సెట్ చేయాలని బోయపాటి అనుకున్నాడు.

కానీ కరోనా కారణంగా అన్ని ప్రాజెక్టుల ప్లానింగ్ తారుమారైపోయింది. దాంతో ఇటు అల్లు అర్జున్ గానీ .. అటు రవితేజగాని బోయపాటికి అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన లింగుస్వామి సినిమా తరువాత బోయపాటితోనే చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Boyapati Sreenu
Allu Arjun
Raviteja
Ram

More Telugu News