'ముగ్గురు మొనగాళ్లు' ట్రైలర్ రిలీజ్
- వినోదమే ప్రధానంగా 'ముగ్గురు మొనగాళ్లు'
- వరుస హత్యల చుట్టూ తిరిగే కథ
- శ్రీనివాస రెడ్డి కామెడీ హైలైట్
- ముఖ్య పాత్రలో టీఎన్నార్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కామెడీని .. సస్పెన్స్ ను కలిపి అందించిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. శ్రీనివాస్ రెడ్డి చేయి తిరిగిన కమెడియన్. ఆయన కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పచ్చు.