Chiranjeevi: 'లూసిఫర్' రీమేక్ లో అనుష్క?

  • ముగింపు దశలో 'ఆచార్య'
  • 'లూసిఫర్' రీమేక్ కు సన్నాహాలు
  • తెలుగు నేటివిటీకి తగిన మార్పులు
Anushka fix for Lucifer remake

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఇది ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత చిరంజీవి 'లూసిఫర్' రీమేక్ లో చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. తమిళ దర్శకుడు మోహన్ రాజాకి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. ఆయన తెలుగు నేటివిటీకి తగిన మార్పులు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా .. మలయాళంలో లేని హీరోయిన్ పాత్రను ఈ సినిమాలో క్రియేట్ చేస్తున్నారు.

హీరోయిన్ పాత్ర కథకి ఎక్కడా అడ్డుపడకుండా, హీరోయిన్ లేదనే అసంతృప్తి ప్రేక్షకులకు కలగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ పదిహేను నిమిషాల నిడివిలో హీరోయిన్ పాత్రను చూపించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సందార్భానికి తగిన ఒక నేపథ్య గీతం కూడా ఉండనుందని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా నయనతార పేరు వినిపించింది. తాజాగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. అనుష్కనే ఖాయమవుతుందని అంటున్నారు.

More Telugu News