కరోనాకు బలైన బాలల సంక్షేమ కార్యకర్త రేణుక!
- రెండు దశాబ్దాలుగా బాలల సంక్షేమం కోసం కృషి
- తన ఆర్గనైజేషన్‌లో 1300 మంది బాలికలు
- గత నెల 20న సంక్రమించిన వైరస్
- లింగ వివక్షపై పలు పుస్తకాలు
రేణుక తన జీవితంలో సగానికిపైగా బాలల హక్కులు, అందరికీ విద్య మొదలైన వాటి కోసం కృషి చేశారు. లింగ వివక్షపై సొంతంగానూ, భర్తతో కలిసి పలు పుస్తకాలు రాశారు. కాగా, తాను బయోలాజికల్‌గా ఇద్దరికే తల్లినని, కానీ తన పిల్లలు 1300 మందని రేణుక చెబుతుండేవారు. ఆమె ఆర్గనైజేషన్ పశ్చిమ యూపీలో 1300 బాలికల సంరక్షణను చూసుకుంటోంది.