Allu Arjun: బోయపాటితోనే బన్నీ తదుపరి సినిమా?

  • ముగింపు దశలో బోయపాటి 'అఖండ'
  • నెక్స్ట్ మూవీ హీరోగా అల్లు అర్జున్
  • గతంలో ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు'
  • కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు    
Allu Arjun next movie with Boyapati

అల్లు అర్జున్ ప్ర్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే విషయంపై అభిమానులు కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ .. మురుగదాస్ పేర్లు వినిపించాయి. ప్రశాంత్ నీల్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఇక మురుగదాస్ ఒక కథను రెడీ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు.

అందువలన ఇప్పట్లో ఈ ఇద్దరితో అల్లు అర్జున్ ప్రాజెక్టు ఉండకపోవచ్చనే అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బోయపాటి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి చేస్తున్న 'అఖండ' పూర్తికాగానే, అల్లు అర్జున్ తోనే ఆయన సెట్స్ పైకి వెళతాడని అనుకుంటున్నారు. ఆల్రెడీ అల్లు అరవింద్ ఇచ్చిన అడ్వాన్స్ బోయపాటి దగ్గర ఉందట. గతంలో అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' సూపర్ హిట్ గా నిలిచింది. కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను బోయపాటి మొదలెట్టేశాడనీ, ఈ విషయంపై ఆయన అల్లు అరవింద్ ను .. బన్నీని కలిశాడని చెప్పుకుంటున్నారు.

More Telugu News