ఓటీటీ దిశగా 'సీటీమార్' అడుగులు?

08-05-2021 Sat 19:03
  • సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్'
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ ఇది
  • కబడ్డీ కోచ్ గా గోపీచంద్
  • ఆయన సరసన నాయికగా తమన్నా
Seetimar will be released in OTT

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' సినిమా రూపొందింది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను క్రితం నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి థియేటర్లు తెరిచే వరకూ ఎదురుచూడటం కూడా కష్టమే. అందువలన ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

గోపీచంద్ కి కొంతకాలంగా హిట్ లేదు .. అందువలన ఆయన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.  వైవిధ్యభరితంగా సాగే స్పోర్ట్స్ నేపథ్యంలోని కథ కావడం .. భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన ఆయన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. ఇక సంపత్ నంది పరంగా చూసుకుంటే, ఆడియన్స్ తో ఆయనకు చాలా గ్యాప్ వచ్చేసింది. అందువలన ఆయన కసితో చేసిన సినిమా ఇది. ఆయన కూడా థియేటర్ల వైపే చూస్తున్నాడట. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఓటీటీకి వెళుతుందా? థియేటర్లకు వస్తుందా? అనేది చూడాలి.