ఇప్పుడు మంత్రి బొత్సను తొలగిస్తారా? లేక ఆళ్ల నానినా?: వర్ల రామయ్య
- రామతీర్థ ఆలయ నిర్వహణ సరిగా లేదని అప్పట్లో అన్నారు
- ఛైర్మన్ అశోక గజపతి రాజును తొలగించారు
- మరి ఈ రోజు ఆక్సిజన్ సరిగా అందక కొవిడ్ రోగులు మృతి
- ఇప్పుడు మీరు ఎవరిని తొలగిస్తారు?
'ముఖ్యమంత్రి గారూ! రామతీర్థ కోదండ రామాలయ నిర్వహణ సరిగా లేదని దేవాలయ ఛైర్మన్ అశోక గజపతి రాజును తొలగించారు. మరి, ఈ రోజు ఆక్సిజన్ సరిగా అందక, విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులు మరణించారు. ఇప్పుడు మీరు ఎవరిని తొలగిస్తారు? జిల్లా మంత్రి బొత్సనా లేక ఆరోగ్య మంత్రి ఆళ్ల నానినా?' అని వర్ల రామయ్య ప్రశ్నించారు.