జగన్ లా యాక్ట్ చేసి చూపించిన రఘురామకృష్ణరాజు... వీడియో ఇదిగో!

Raghurama Krishnaraju acts like CM Jagan
  • రఘురామ, వైసీపీ మధ్య వార్
  • ఏపీ నుంచి వైసీపీ మాటల తూటాలు
  • ఢిల్లీ నుంచి రఘురామ కౌంటర్లు
  • తాజాగా ఓ వీడియోలో అనుకరించిన ఎంపీ
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు, వైసీపీకి మధ్య పూడ్చలేనంత అంతరం ఏర్పడింది. ఇటీవల కాలంలో రఘురామకృష్ణరాజుకు, వైసీపీ నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామ ఓ వీడియోలో సీఎం జగన్ ను అనుకరిస్తూ మాట్లాడారు. జగన్ లాగా హావభావాలు ప్రదర్శించారు. జగన్ సభ ఆరంభంలో మైక్ అందుకుని దానిపై టపాటపా అని ఎలా కొడతారో, రఘురామ కూడా అలాగే కొట్టి, ఆపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Jagan
Acting
Video
YSRCP
Andhra Pradesh

More Telugu News