రూ.3,383 కోట్ల ఆస్తి... బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే!

రూ.3,383 కోట్ల ఆస్తి... బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే!

Parag Shah BJP MLA with 3383 crore assets turns into a beggar for a day
  • వేల కోట్ల ఆస్తులున్న బీజేపీ ఎమ్మెల్యే
  • ఒక రోజు పాటు బిచ్చగాడి వేషంలో గడిపిన పరాగ్ షా
  • జైన గురువు సలహా మేరకు ఈ అనుభవాన్ని పొందిన ఎమ్మెల్యే
  • చిరిగిన బట్టలతో రోడ్డుపై కూర్చుని భిక్షాటన
  • ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్‌లో ఈ ఘటన
ముంబైకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఒక రోజు పాటు యాచకుడి వేషధారణలో గడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాదాపు రూ. 3,383 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన ఆయన, చిరిగిన దుస్తులు ధరించి రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.

అధికారం, విలాసాలకు దూరంగా సామాన్య జీవితాన్ని ఒక్కరోజైనా అనుభవించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జైన ఆధ్యాత్మిక గురువు నమ్రముని మహారాజ్ సూచన మేరకు పరాగ్ షా ఈ సాహసం చేశారు. ఎటువంటి సౌకర్యాలు లేని సామాన్యుల జీవితం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకునేందుకు ఈ విభిన్న అనుభవాన్ని ఎంచుకున్నారు.

ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరాగ్ షా, 2024 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ. 3,383 కోట్లుగా ప్రకటించారు. దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరైన ఆయన ఇలా బిచ్చగాడి రూపంలో కనిపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

ఒక రోజంతా భిక్షాటన అనంతరం ఆయన తిరిగి సాధారణ దుస్తులు ధరించి స్థానిక ప్రజలతో ముచ్చటించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Advertisement
Parag Shah
BJP MLA
Mumbai
Richest MLA
Beggar for a day
Ghatkopar East

More Telugu News