బోడెన్సీ సరస్సును ఈదిన డీఎస్సీ విజేత.. నారా లోకేశ్ ఏమన్నారంటే..!
- పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన బలగ గణేశ్
- జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు 12 కి.మీ. సరస్సును ఈదారు
- 5 గంటల 14 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి సరికొత్త రికార్డు సాధించారు
- గణేశ్‌ను అభినందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్ బలగ గణేశ్ అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు విస్తరించి ఉన్న 12 కిలోమీటర్ల బోడెన్సీ సరస్సును వెట్‌సూట్ లేకుండా ఈది, ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన పారా స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించారని వివరించారు. ఈ మేరకు నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గణేశ్ ఈ దూరాన్ని కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేశారని, దీనితో జర్మనీకి చెందిన స్వెన్ ఎకార్డ్ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డు బద్దలైందని లోకేశ్ తన పోస్టులో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో గణేశ్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారని లోకేశ్ తెలిపారు.
ఈ అసాధారణ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. "మా ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన గణేశ్ మాస్టారు పారా స్విమ్మింగ్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం మనందరికీ గర్వకారణం" అని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు గణేశ్ ఘనతకు సంబంధించిన వీడియోను లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. బలగ గణేశ్ సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ధీరజ్ కు అభినందనలు
అటు, మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు కూడా నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు. "ధీరజ్ గెలుపు ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఫస్ట్ ఇండియన్ ఆర్చర్‌గా నిలిచి ధీరజ్ రికార్డు సృష్టించారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణ, కఠోర సాధనతో గోల్డ్ మెడల్ గెలిచిన ధీరజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మరో పోస్టులో పేర్కొన్నారు.