Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: 64 మందికి పాజిటివ్

Sixty four people tested Corona positive in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 21,922 కరోనా టెస్టులు నిర్వహించగా 64 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 10, కృష్ణా జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 7 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 99 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. కృష్ణా జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,900 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,504 మంది ఆరోగ్యవంతులయ్యారు. 1,242 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 7,154కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News