దేవుడు ప్రత్యక్షమైతే నేను అడిగేది ఇదే: రచ్చరవి
- 'జబర్దస్త్'తో రచ్చరవిగా గుర్తింపు
- వరుస సినిమాలలోనూ బిజీ
- పుస్తకం రాసిన రచ్చరవి
- నేటి పేరెంట్స్ - పిల్లలు ప్రధానమైన కథాంశం
"ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం నాకు ఇష్టం. నేను ఇంకా ఏం చేయగలను .. ఏం నేర్చుకోగలను? అనే విషయాలను గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. అనవసరమైన విషయాలను గురించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయడం నాకు నచ్చదు. అందువలనే 'సింగ్ గీతం' సినిమా షూటింగ్ సమయంలో నాకు దొరికిన ఖాళీ సమయంలో నేను ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. నేను చూసిన కుటుంబ వ్యవస్థ .. ఇప్పటి కుటుంబ వ్యవస్థ గురించి నేను గ్రహించింది రాసుకొచ్చాను" అని ఆయన అన్నారు.
"మా అమ్మమ్మ .. నాన్నమ్మలతో నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ రోజులు నాకు చాలా గొప్పగా అనిపిస్తాయి. ఈ తరం పిల్లలు .. వాళ్ల అమ్మమ్మలు - నాయనమ్మలు కూడా వేరే వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. అమ్మమ్మలు - నాయనమ్మలను పట్టించుకోకుండా, చిన్న చిన్న పిల్లలతో పెద్ద పేద రీల్స్ చేయిస్తున్నారు. అదే నాకు బాధను కలిగిస్తూ ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమైతే మా అమ్మమ్మ - నాయనమ్మలను ఇవ్వమనే అడుగుతాను.
" నేను ఈ పుస్తకంలో ఈ కాలం నాటి పేరెంట్స్ ను .. పిల్లలను గురించి ప్రస్తావించాను. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వడం వేరు .. వాళ్ల మానాన వాళ్లను వదిలేయడం వేరు. తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా పెంచాలి. కన్నవాళ్లు .. మన ఇల్లు .. మన ఊరును ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటే ఏ పిల్లలు తప్పు చేయలేరు. బాధ్యతగా పెంచాలి .. బాధ్యతగా నడుచుకోవాలి అనేదే నేను చెప్పింది. ఇక ఖాలీగా ఉంటూ కామెంట్ చేసేవాళ్లను గురించి నేను పట్టించుకోను. నా దృష్టిలో సమయం చాలా విలువైంది. నేను దానిని సద్వినియోగం చేసుకుంటూ వెళుతుంటాను" అని చెప్పారు.