అమ్మని చూడనే లేదు .. కష్టాలు మాత్రం చూశాను: నటుడు మహేంద్రన్

Mahendran Interview
  • బాల నటుడిగా పేరు తెచ్చుకున్న మహేంద్రన్
  • తల్లి లేకుండా పెరగడం పట్ల ఆవేదన
  • తండ్రి చేసిన త్యాగం గురించిన ప్రస్తావన 
  • కెరియర్ పరంగా ఎదగాల్సి ఉందని వ్యాఖ్య 
  
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన సినిమాలలో 'దేవి' ఒకటి. 'ప్రేమ' ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా చూసినవారు ఎవరైనా అందులోని బాలనటుడిని నటనను మరిచిపోలేరు. ఆ కుర్రాడి పేరే మహేంద్రన్. ఆ తరువాత తెలుగులో ఓ పాతిక సినిమాల వరకూ బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని తాజా చిత్రంగా 'శ్రీనివాస మంగాపురం' ప్రేక్షకుల ముందుకు రానుంది.  సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను  అతను ప్రస్తావించాడు. 

"నేను పుట్టింది హైదరాబాద్ లోనే. అప్పట్లో అమ్మానాన్నలు 'కోఠీ'లో ఉండేవారు. నేను పుట్టిన తరువాత అమ్మ చనిపోయింది. అందువలన అమ్మ ఎలా ఉంటుందనేది నాకు తెలియదు. అప్పటి నుంచి అన్నయ్యను .. నన్ను నాన్న పెంచుతూ వెళ్లారు. మా కోసం ఆయన చాలా కష్టాలు పడ్డారు. వాచ్ మెన్ ఫ్యామిలీకి నన్ను అప్పగించి తాను పనికి వెళ్లేవారు. నేను వాళ్లతో పాటే ఉండేవాడిని. ఆ తరువాత మేమంతా చెన్నైకి  వెళ్లడం జరిగింది. అక్కడే నన్ను బాలనటుడిగా చేయడం కోసం నాన్న తిరగడం జరిగింది" అని అన్నాడు. 

" చాలా చిన్నప్పుడే నేను డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడిని. సింగిల్ టేక్ లో చేసేవాడిని. సమయాన్ని .. రీల్ ను వేస్ట్ చేయనని చెప్పి నాతోనే చేయించేవారు. అలా చాలా మంది స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రలు చేశాను. ఒక్క తమిళంలోనే 130 సినిమాలు చేశాను. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. కానీ నాన్న ఆశించిన స్థాయికి ఇంకా ఎదగలేదు. ఆ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాను" అని చెప్పాడు. 

Mahendran
Master Mahendran
Devi movie child actor
Srinivasa Mangapuram movie
Actor Mahendran interview
Kodi Ramakrishna

More Telugu News