Corona Virus: ఏపీలో కనిష్ఠ స్థాయిలో కొత్త కేసుల నమోదు

Lowest corona positive cases in AP
షార్ట్స్‌లో చూడండి
ఏడాది కాలంగా అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇటీవల కాలంలో శాంతించిందనే చెప్పాలి. తాజాగా ఏపీలో కనిష్ట స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27,717 కరోనా పరీక్షలు నిర్వహించగా 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 141 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,149కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,066కి చేరింది. 8,78,528 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,389కి పడిపోయింది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths
Active Cases
Covid Tests

More Telugu News