కంగనాకు కొత్త చిక్కులు... నోటీసులు పంపిన రచయిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కంగనాకు కొత్త చిక్కులు... నోటీసులు పంపిన రచయిత

Writes sends legal notices to Kangana Ranaut
  • గతంలో మణికర్ణిక చిత్రంలో నటించిన కంగనా
  • మణికర్ణిక సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు
  • అది తన నవలే అంటున్న ఆశిష్ కౌల్ అనే రచయిత
  • అన్ని హక్కులు తన వద్దే ఉన్నాయని వెల్లడి
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు వివాదాలు కొత్త కాదు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. కంగనా గతంలో మణికర్ణిక అనే చిత్రంలో నటించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తోంది. దాని పేరు 'మణికర్ణిక... ది లెజెండ్ ఆఫ్ దిద్దా'. దిద్దా ఓ కశ్మీరీ రాణి. ఆమె జీవితం ఆధారంగానే మణికర్ణిక-2 తెరకెక్కనుంది.

అయితే, ఈ చిత్రాన్ని తన నవల ఆధారంగా తీస్తున్నారంటూ ఆశిష్ కౌల్ అనే రచయిత లీగల్ నోటీసులు పంపాడు. ఆశిష్ కొన్నాళ్ల కిందట 'దిద్దా... కశ్మీర్ కి యోధా రాణి' అనే నవల రాశాడు. అయితే, ఈ నవలకు సంబంధించిన అన్ని హక్కులు తన వద్దే ఉన్నాయని, అలాంటప్పుడు తన అనుమతి లేకుండా కంగనా ఆ సినిమాను ఎలా తెరకెక్కిస్తుందని ఆశిష్ ప్రశ్నిస్తున్నాడు. దీనిపై కంగనా స్పందించాల్సి ఉంది.
Kangana Ranaut
Legal Notices
Asish Kaul
Didda
Kashmiri Queen

More Telugu News