జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ
- ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
- మరికొన్నిరోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సినేషన్
- మొదట ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్
- ఆ తర్వాత 50 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్
- ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యత
అయితే, తొలి విడతలో దేశంలోని ముందువరుస యోధులైన ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. వీరి సంఖ్య 3 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం రెండో విడతలో 50 ఏళ్లకు పైబడిన వారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపువారికి టీకా అందిస్తారు. వీరి సంఖ్య 27 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాతే ఇతర ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపిణీపై వివరాలు తెలిపింది.