'తలైవి' నుంచి అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ విడుదల
- హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’
- ఎఎల్ విజయ్ దర్శకత్వం
- ఎంజీఆర్ గా అరవింద్ స్వామి
ప్రకాశ్ రాశ్, భాగ్యశ్రీ కూడా ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి లుక్ ఆకట్టుకుంటోంది. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల పర్యవసానంగా, ఆయన రాజకీయ వారసురాలిగా జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.