డ్రైనేజీల పరిసరాల్లో పడుకుని, అక్కడి ప్రజలకు ఎప్పుడు భరోసానిస్తావు విజయసాయిరెడ్డి?: బుద్ధా వెంకన్న

budda venkanna slams vijay sai
  • నువ్వు విశాఖలో చేసిన ఓవర్ యాక్షన్, ఫొటో షూట్ లు ఇంకా గుర్తున్నాయి 
  • మరి ఏలూరు ఎప్పుడు వస్తున్నావ్?
  • అసలే చలి కాలం, ముసలోడివి తట్టుకోలేవు ఏమో
కొన్ని నెలల క్రితం విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో విషవాయువు లీకైనప్పుడు బాధిత గ్రామాల ప్రజల్లో ధైర్యం నింపేందుకు సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు బాధిత గ్రామాల్లో బస చేసిన విషయం తెలిసిందే. అక్కడే రాత్రి పూట భోజనం చేసి నిద్ర చేశారు. ఆర్ఆర్ వెంకటాపురంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ సమయంలో నిద్రించారు.

ఆ సమయంలో విజయసాయిరెడ్డి తీసుకున్న ఫొటోను టీడీపీ నేత బుద్ధా వెంకన్న పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏలూరులో ప్రజలు వింత వ్యాధితో బాధపడుతుంటే అక్కడకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు.

‘నువ్వు విశాఖలో చేసిన ఓవర్ యాక్షన్, ఫొటో షూట్ లు, ఇంకా గుర్తున్నాయి విజయసాయి. మరి ఏలూరు ఎప్పుడు వస్తున్నావ్? అక్కడ నీరు తాగి, అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీల పరిసరాల్లో పడుకుని, అక్కడ ప్రజలకు ఎప్పుడు భరోసా ఇస్తున్నావ్? అసలే చలి కాలం, ముసలోడివి తట్టుకోలేవు ఏమో. నువ్వు రాకపోతే, తాడేపల్లి నుంచి నీ అల్లుడునైనా పంపించ్చు’ అని బుద్ధా వెంకన్న చురకలంటించారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
YSRCP
Vijay Sai Reddy

More Telugu News