సుజిత్ దర్శకత్వంలో గోపీచంద్ తదుపరి సినిమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుజిత్ దర్శకత్వంలో గోపీచంద్ తదుపరి సినిమా?

Sujith to direct Gopichand
  • 'సీటీమార్' చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ 
  • హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్
  • 'సాహో' ఫేమ్ సుజిత్ తో సంప్రదింపులు  
మొదటి నుంచీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న హీరో గోపీచంద్ ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీ మార్' చిత్రాన్ని చేస్తున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. దీని తర్వాత గోపీచంద్ తన తదుపరి చిత్రాన్ని 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్ తో చేసిన 'సాహో' సినిమా విజయం సాధించనప్పటికీ, యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ రీత్యా దర్శకుడు సుజిత్ కి అది మంచి పేరుతెచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. అలాగే ఇటీవల 'ఛత్రపతి' సినిమా హిందీ రీమేక్ కి కూడా ఆయన పేరు వినిపించినా, దానిని సుజిత్ ఖండించాడు.

ఈ క్రమంలో గోపీచంద్ తో సుజిత్ సినిమా దాదాపు ఓకే అయినట్టు, దీనిని ఓ ప్రముఖ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందట.
Gopichand
Tamannaah
Sujith
Prabhas

More Telugu News