ఒక్క చాన్స్ అంటూ 400 హామీలిచ్చారు... సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శలు
- ఏనుగుల మందలా వైసీపీ నేతలు గ్రామాలపై పడ్డారని వ్యాఖ్యలు
- జగన్ సర్కారు 34 పథకాలు నిలిపివేసిందని ఆరోపణ
- ఒక్క చాన్స్ నినాదం జనాల్లో బాగా పనిచేసిందన్న దీపక్
ఇవాళ వైసీపీ అధికారంలో ఉండడం వెనుక ప్రత్యేక కారణాలు ఏవీ లేవని, ఒకే ఒక్క చాన్స్ అంటూ జగన్ వేడుకున్నారని, ప్రజలపై అది బాగా ప్రభావం చూపిందని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, 13 జిల్లాలను 13 రాజధానుల్లా అభివృద్ధి చేస్తాం, మాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి అంటూ ప్రచారం చేసుకున్నారని తెలిపారు. పైగా, తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని మభ్యపెట్టారని దీపక్ రెడ్డి విమర్శించారు.