భారత క్రికెట్ పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఓఏ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ
- క్రికెట్ పెద్దల్లో బంధుప్రీతి ఉందన్న గుహ
- శ్రీనివాసన్ అల్లుడు బెట్టింగ్ రాయుడని వెల్లడి
- అమిత్ షా తనయుడికి కీలక పదవి లభించిందన్న గుహ
- గంగూలీపైనా వ్యాఖ్యలు చేసిన గుహ
బంధుప్రీతితో వ్యవహరిస్తున్నారని, కుట్రలు, అస్మదీయుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల క్రికెట్ సంఘాలను ఎవరి కుమారుడో, ఎవరి కుమార్తెనో నడిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయని, రంజీ ఆటగాళ్ల బకాయిలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు. శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ఇంతక్రితం క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్నాడని, అమిత్ షా కుమారుడు జై షా ప్రస్తుతం బీసీసీఐలో కార్యదర్శి అని వివరించారు.
రామచంద్ర గుహ ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. గంగూలీ బీసీసీఐ చీఫ్ గా ఉన్నా, ఓ క్రికెట్ ఫాంటసీ గేమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, మనదేశ ఆటగాళ్లలో డబ్బు కోసం ఇలాంటి దురాశ దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.