పుష్కరాల్లో చంద్రబాబు రూ.3400 కోట్లు మేశాడు.. 30 మంది ప్రాణాలు తీశాడు: విజయసాయిరెడ్డి
- హిందూ సంప్రదాయాల్లో పుణ్య స్నానాలకు విశిష్ట స్థానం ఉంది
- బాబు హయాంలో పుష్కరాలొచ్చాయంటే భారీ దోపిడీకి స్కెచ్ పడేది
- తుంగభద్ర పుష్కరాలను జగన్ గారు కేవలం 200 కోట్లతో నిర్వహిస్తున్నారు
ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈ విషయంపై స్పందించారు. గతంలో పుష్కరాల పేరిట టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారని, ఇప్పుడు జగన్ అతి తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు.
‘హిందూ సంప్రదాయాల్లో పుణ్య స్నానాలకు విశిష్ట స్థానం ఉంది. బాబు హయాంలో పుష్కరాలొచ్చాయంటే భారీ దోపిడీకి స్కెచ్ పడేది. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో 3,400 కోట్ల రూపాయలు మేశాడు. 30 మంది ప్రాణాలు తీశాడు. తుంగభద్ర పుష్కరాలను జగన్ గారు కేవలం 200 కోట్ల రూపాయలతో ఘనంగా నిర్వహిస్తున్నారు’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.