సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బిజినెస్ లో అడుగుపెడుతున్న పాయల్
- 'సీటీమార్' చివరి షెడ్యూల్ షూటింగ్
- 'ఎఫ్ 3'లో మరో హీరోగా రవితేజ?
* గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 23 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. సింగిల్ షెడ్యూల్ లో దీనిని పూర్తి చేస్తారు. లాక్ డౌన్ కి ముందు జరిగిన షూటింగులో 60 శాతం పూర్తయింది.
* అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని, ఆ పాత్రకు గాను రవితేజను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.