దళితులకు జగన్ పెద్ద పీట వేస్తున్నారు: ఏపీ మంత్రి నారాయణస్వామి
- జగన్ కులమతాలకు అతీతుడు
- బీసీలు, దళితులకు పెద్దపీట వేస్తున్నారు
- గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నారు
56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీలకు జగన్ పెద్దపీట వేశారని నారాయణస్వామి చెప్పారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారని తెలిపారు. మండల వ్యవస్థను ఎన్టీఆర్ బలోపేతం చేశారని... జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని తెలిపారు. జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఘన విజయం సాధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది గతించిన చరిత్ర అని అన్నారు.