ముంబై ఎయిర్ పోర్టులో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫొటోలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముంబై ఎయిర్ పోర్టులో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Prabhas returned form Italy
  • ఇటలీ షెడ్యూల్ ను ముగించుకున్న ప్రభాస్
  • నిన్న రాత్రి  ముంబై చేరుకున్న యంగ్ రెబల్ స్టార్
  • ఇటీవలే ఇండియాకు వచ్చిన పూజ హెగ్డే
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి.

కరోనా ఉద్ధృతి కొంత తగ్గిన వెంటనే చిత్ర యూనిట్ ఇటీలీకి వెళ్లి షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటలీ షూటింగ్ ముగించుకుని పూజహెగ్డే ఇటీవలే ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన వెంటనే 'త్వరలోనే హైదరాబాదులో కలుద్దాం ప్రభాస్' అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ పెట్టింది.

తాజాగా ప్రభాస్ కూడా తన ఇటలీ షెడ్యూల్ ను ముగించుకున్నాడు. ఇటలీ నుంచి నిన్న రాత్రి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ముంబై ఎయిర్ పోర్టులో ప్రభాస్ ను ఫొటోగ్రాఫర్స్ క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Prabhas
Pooja Hegde
Tollywood
Italy

More Telugu News