ఇక శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి: వర్ల రామయ్య
- ఎర్ర చందనం స్మగ్లర్లకు రాష్ట్రం స్వర్గ ధామంగా మారింది
- అధికార గణం మామూళ్ల మత్తులో ఉంది
- స్మగ్లర్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు
- ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు ఈ స్మగ్లింగ్ సూత్రధారి
‘రాష్ట్రం, ఎర్ర చందనం స్మగ్లర్లకు స్వర్గ ధామంగా మారింది. అధికార గణం మామూళ్ల మత్తులో ఉంటే, స్మగ్లర్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు, నేర చరిత్ర కలిగిన ఆప్తుడు ఈ స్మగ్లింగ్ సూత్రధారి అని చాలామందికి తెలుసు. ఇక, శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి’ అని వర్ల రామయ్య చెప్పారు.