చూడముచ్చటగా ఉండే కొత్త రకం చేపను గుర్తించిన సీఎం ఉద్ధవ్ థాకరే తనయుడు!
- స్కిస్తురా హిరణ్యాక్షి అని కొత్త రకం చేపకు పేరు
- ఆక్సిజన్ ఎక్కువగా కలిగిన చెరువుల్లో కనిపించే చేప
- ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో వివరాలు
ఈ చేప చిన్నగా చూడముచ్చటగా ఉంది. పైన బంగారపు వర్ణంలో వెంట్రుకలు ఉన్నాయి. హిరణ్యాక్షి చేపలు ఆక్సిజన్ ఎక్కువగా ఉండే మంచినీటి చెరువులు, నదుల్లోనే కనిపిస్తుంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. తేజస్ 2012లో తొలిసారి ఈ చేపను కనుగొన్నారని, 2017లో ఇదే జాతికి చెందిన మరిన్ని చేపలను కనుగొన్నట్టు ప్రవీణ్‌రాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురితమయ్యాయి.