హీరోయిన్ కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక కోర్టు ఆదేశాలు జారీ

A Karnataka court orders registration of FIR against actor Kangana Ranaut
  • వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇటీవల రైతుల ఆందోళనలు
  • రైతులను ఉద్దేశిస్తూ కంగన అనుచిత వ్యాఖ్యలు
  • తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ట్వీట్ డిలేట్  
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. అన్నదాతలపై ఆమె ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది.

దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆ ట్వీట్ ను డిలేట్ చేసింది. దానిపై స్పందిస్తూ..  తాను రైతుల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మరో ట్వీట్ లో తెలిపింది. కాగా, ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు కర్ణాటకలోని ఓ కోర్టులో కేసులో వేసి, ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
Go Back to Shorts
Karnataka
Kangana Ranaut
Bollywood

More Telugu News