దిక్కుతోచని స్థితిలో సుబాబుల్, జామాయిల్ రైతు: దేవినేని ఉమ
- చంద్రబాబు హయాంలో టన్నుకు రూ.4,200
- నేడు దక్కేది టన్నుకు 900 రూపాయలు మాత్రమే
- రైతులను దోపిడీ చేస్తున్న దళారులు
- అయినకాడికి అమ్మి తోటలు తొలగిస్తున్న రైతులు
'దిక్కు తోచని స్థితిలో సుబాబుల్, జామాయిల్ రైతు. చంద్రబాబు నాయుడి హయాంలో టన్నుకు 4,200 వరకు అమ్మిన రైతుకు నేడు దక్కేది టన్నుకు 900 రూపాయలు మాత్రమే, రైతులను దోపిడీ చేస్తున్న దళారులు, అయినకాడికి అమ్మి తోటలు తొలగిస్తున్న రైతులు. 2015 ధరల ప్రకారం 4,200కి మార్కెట్ కమిటీలు కొనుగోలు చేయాలంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా? వైఎస్ జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.