ఇంట్లో జారిపడిన నన్నపనేని... తలకు గాయం!
- గుంటూరు జిల్లా తెనాలిలో ఘటన
- నన్నపనేనిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న నన్నపనేని
- టీడీపీ నేతల ఆరా
నన్నపనేని జారిపడ్డారన్న విషయం తెలియగానే టీడీపీ నేతలు ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు కనుక్కుంటున్నారు. ఆమె క్షేమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. నన్నపనేని రాజకుమారి కొంతకాలం కిందట ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి తెనాలిలోని స్వగృహంలో ఉంటున్నారు.