డ్రగ్స్ కేసులో తనపై కథనాలను నిలుపుదల చేయాలంటూ.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్
- మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు దృష్టిని తీసుకెళ్లిన రకుల్
- మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మీడియాలో వార్తలని ఆగ్రహం
దీంతో అన్ని మీడియా చానెళ్లలోనూ రకుల్ పేరు మారుమోగిపోయింది. మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఈ రోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల తన గురించి మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తన లాయరు ద్వారా న్యాయస్థానానికి అందజేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మీడియా వార్తలు రాస్తోందని, వీటిని ప్రసారం చేయకుండా నిలుపుదల చేయాలని కోరింది. జస్టిస్ చావ్లా బెంచ్ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.