Rhea Chakraborty: సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. ప్రియాంకపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి!

Rhea Chakraborty Files Forgery Case Against Sushant Rajputs Sister
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ పై ఈ కేసులో ఆరోపణలు ఎందుర్కొంటున్న హీరోయిన్ రియా చక్రవర్తి ఫోర్జరీ కేసు పెట్టింది. సుశాంత్ కు సంబంధించి బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను ఇచ్చిందంటూ ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ప్రిస్క్రిప్షన్ వచ్చిన ఐదు రోజుల్లోనే సుశాంత్ చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ తరుణ్ కుమార్ పై కూడా ఆరోపణలు చేసింది.

బోగస్ ప్రిస్క్రిప్షన్ లతో సుశాంత్ కు వైద్యం చేశారని... ఈ నేపథ్యంలో ప్రియాంక, తరుణ్ తదితరులను విచారించాల్సిన అవసరం ఉందని రియా తెలిపింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్ గా సుశాంత్ కు బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన జూన్ 8వ తేదీన సుశాంత్ ముంబైలోనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
Go Back to Shorts
Rhea Chakraborty
Sushant Singh Rajput
Bollywood
Priyanka Singh
Forgery Case

More Telugu News