సుశాంత్ ను హత్య చేసినట్టు ఇంకా ఆధారాలు దొరకలేదు: సీబీఐ అధికారి
- కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ
- ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు
- త్వరలోనే ఫోరెన్సిక్ రిపోర్టును పరిశీలించనున్న వైనం
సుశాంత్ ను హత్య చేశారంటూ పలువురు ఆరోపణలు చేసిన నేపథ్యంలో, హత్యా కోణంలో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్టును కూడా త్వరలోనే పరిశీలించనుంది. ఇప్పటికే సుశాంత్ చనిపోయిన ప్రదేశంలో సీబీఐ అధికారులు సీన్ ను రీకనస్ట్రక్ట్ చేసిన సంగతి తెలిసిందే.