ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడని జాలిచూపమన్నాను: భూమన
- వరవరరావును విడుదల చేయాలంటూ భూమన లేఖ
- తీవ్రంగా తప్పుబట్టిన సునీల్ దేవధర్
- ఆసుపత్రి నుంచే ప్రకటన చేసిన భూమన
ఓవైపు సీఎం జగన్ ప్రధాని మోదీని కలిసి ఆయనతో తీయించుకున్న ఫొటోలను పోస్టు చేస్తుంటారని, మరోవైపు, భూమన వంటి నేతలు మోదీ హత్యకు కుట్రపన్నిన కరడుగట్టిన నక్సలైటు వరవరరావును విడుదల చేయాలని కోరుతుంటారని, ఈ డబుల్ గేమ్ ఆపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై భూమన తాజాగా స్పందిస్తూ.... ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదని, కానీ అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడి పట్ల మానవతా దృక్పథంతో జాలి చూపించమన్నానని వివరించారు. "వరవరరావు, నేను, ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు జైలులో కలిసి ఉన్నాం కాబట్టే, నేను ఉపరాష్ట్రపతికి లేఖ రాశాను. కానీ నా అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధ కలిగించింది" అంటూ భూమన ఓ ప్రకటన వెలువరించారు.