ప్రచారం కోసం పక్కవాడి బిడ్డను కూడా మా బిడ్డే అంటున్నారు: బోండా ఉమ
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుర్గ గుడి ఫ్లైఓవర్ ను వైసీపీ అడ్డుకుంది
- వైసీపీ పాలన మొత్తం అవినీతితో నిండిపోయింది
- కరోనా పేరుతో కమిషన్లను కూడా వసూలు చేస్తున్నారు
వైసీపీ పాలన మొత్తం అవినీతితో నిండిపోయిందని ఉమ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాపారులను దోచుకుంటున్నారని చెప్పారు. చివరకు కరోనా పేరుతో కమిషన్లను కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ నియామకాలను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. గుట్కా, పేకాట దందాలు ఎక్కువైపోయాయని అన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా? అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.