రాయ్‌గఢ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. శిథిలాల నుంచి 60 మంది వెలికితీత
- నిన్న ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
- ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు
- శిథిలాల కింద మరో 30 మంది
భవనం కూలిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట్ర మంత్రులు అదితి తాట్కరే, ఏక్‌నాథ్ షిండేలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు 60 మందిని రక్షించామని, మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కూలిన భవనంలో 45 వరకు కుటుంబాలు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనేది కచ్చితంగా తెలియరాలేదు.