రెండు దశాబ్దాల కల నెరవేరిన వేళ.. ఇంటి మేడపై విమాన తయారీ!
- భారత్‌లోనే విమానాన్ని తయారు చేయాలని లక్ష్యం
- తొలి దశలో విజయవంతంగా గగన విహారం
- రెండో దశ కోసం రెడీ అవుతున్న మహారాష్ట్ర ‘కెప్టెన్’
విమానం తొలి దశ పరీక్షలకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గతేడాదే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా ఓ టెక్నీషియన్ సాయంతో విమానానికి తొలి దశ పరీక్షలు నిర్వహించారు. రెండో దశ ప్రయోగంలో 2 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరి పరీక్షిస్తామని అమోల్ యాదవ్ తెలిపారు. విమాన పరీక్షల కోసం భారీగా బీమా చేయాల్సి ఉంటుందని, కాబట్టి కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుతున్నట్టు పేర్కొన్నారు.