విచారణ కూడా జరపకుండా అరెస్ట్ చేయడం దారుణం: కొనకళ్ల
- రాజకీయ కక్షతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయించారు
- వివాదాల జోలికి ఆయన వెళ్లరు
- రాష్ట్ర ప్రభుత్వం బీసీలను టార్గెట్ చేసింది
నిందితులు చెప్పారని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని అదుపులోకి తీసుకోవడం సరికాదని చెప్పారు. వివాదాల జోలికి రవీంద్ర వెళ్లరని అన్నారు. సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలనే ధోరణి ఆయనదని అన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని... వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే తప్పుడు కేసులను బనాయిస్తున్నారని చెప్పారు. బీసీలను టార్గెట్ చేసి, వరుసగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.