చంద్రబాబు బాధ అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారి గురించి కాదు: శ్రీకాంత్ రెడ్డి
- అవినీతిపరులను అరెస్ట్ చేస్తే చంద్రబాబుకు ఎందుకు బాధ?
- మంత్రిగా అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డాడు
- అవినీతిపై మాది కక్ష సాధింపే
దమ్ముంటే అవినీతి నిరూపించాలంటూ గతంలో చంద్రబాబు సవాల్ విసిరారని... ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారని... అవినీతి, దోపిడి, అక్రమాలపై తమది కక్ష సాధింపేనని చెప్పారు.
చంద్రబాబు ఆందోళన అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారి గురించి కాదని... తన కుమారుడు లోకేశ్ అవినీతి బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే... దాన్ని కిడ్నాప్ అంటారా? అని మండిపడ్డారు.