Uttam Kumar Reddy: పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను గృహ నిర్బంధం చేసిన్రు: వీడియో పోస్ట్ చేసిన ఉత్తమ్‌

uttam kumar reddy fires on trs
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో వినియోగదారులకు వస్తోన్న కరెంటు బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అదుపు చేస్తున్నారు. పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. దీనిపై ఉత్తమ్‌ మండిపడుతూ తన ఇంటి వద్ద ఉన్న పరిస్థితులపై ఓ వీడియో పోస్ట్ చేశారు.

'ఇవాళ పొద్దుటి నుండి పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి నన్ను అకారణంగా గృహ నిర్బంధం చేసిన్రు. మనం పోలీసు రాజ్యంలో ఉన్నమా? ప్రజాస్వామ్యవాదులను చూసి కేసీఆర్ ఎందుకింత ఉలిక్కిపడుతుండు?' అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News