చంద్రబాబుతో పోటీపడేవాళ్లు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కాలి: యరపతినేని

Yarapathineni challenges YSRCP leaders
  • చంద్రబాబు వయసుపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారన్న యరపతినేని
  • అంబటి ముందుకు రావాలని సవాల్
  • జగన్ కూడా బంకర్లు నిర్మించుకోకతప్పదని వ్యాఖ్యలు
వైసీపీ నేతలు ప్రతిదానికి టీడీపీ అధినేత చంద్రబాబు వయసుపై విమర్శలు చేస్తున్నారని, ఏం.. వైసీపీ వాళ్లకు వయసు పెరగదా? అని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబు వయసుపై పదేపదే మాట్లాడే అంబటి రాంబాబు ముందుకు రావాలని, చంద్రబాబుతో కలిసి తిరుమల కొండ ఎక్కడంలో పోటీ పడాలని సవాల్ విసిరారు.

టీడీపీకి భవిష్యత్ నాయకత్వం లేదని విమర్శిస్తున్నారని, అయితే వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్టు లోకేశ్ కు అవినీతి కార్యకలాపాల్లో అనుభవం లేదని అన్నారు. సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి దోపిడీ చేయడం, దొంగ సొమ్ము దాచుకోవడంలో లోకేశ్ కు అనుభవం లేదని స్పష్టం తెలిపారు. జగన్ ఏడాది పాలన గురించి యరపతినేని స్పందిస్తూ, నేరచరిత్ర ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఇలాగే ఉంటుందని, అమెరికాలో ప్రజాగ్రహానికి జడిసి ట్రంప్ ఎలా బంకర్ లో దాక్కున్నాడో, ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే జగన్ కూడా బంకర్లు నిర్మించుకోక తప్పదని అన్నారు.
Go Back to Shorts
Yarapathineni Srinivas
Chandrababu
Age
YSRCP
Tirumala

More Telugu News