Konda Vishweswar Reddy: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

  • నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం
  • పెండింగ్ ప్రాజెక్టుల వద్ద నిరసనలకు కాంగ్రెస్ నేతల యత్నం
  • కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన సర్కారు
Tense moments at Konda Vishweswar Reddy house

ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశ్వేశ్వర్ రెడ్డిని తరలించేందుకు పోలీసులు రాగా, ఆయన వారిని అడ్డుకున్నారు. వారెంట్ చూపించాలని నిలదీశారు. వారెంట్ ఉంటేనే వస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ తోపులాట చోటుచేసుకుంది. పోలీసులే చట్టాన్ని గౌరవించకపోతే ఎలా? అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.


More Telugu News